ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏం చేశారో... కేసీఆర్‌కు హరీశ్‌రావు అదే చేస్తారు: మాజీమంత్రి పేర్ని నాని

by Disha Web Desk 21 |
ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏం చేశారో... కేసీఆర్‌కు హరీశ్‌రావు అదే చేస్తారు: మాజీమంత్రి పేర్ని నాని
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఖండిచారు. చంద్రబాబు దురదృష్టకరమని అన్నారు. హరీశ్ రావు ఖండనపై ఏపీ మాజీమంత్రి పేర్ని నాని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడు చేసిందే త్వరలో కేసీఆర్‌కు హరీష్‌రావు అదే చేస్తాడని చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మాజీమంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. దివంగత ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఎలా అయితే వెన్నుపోటు పొడిచారో రాబోయే రోజుల్లో కేసీఆర్‌కు హరీశ్‌రావు వెన్నుపోటు పొడవడం ఖాయమన్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను హరీశ్ రావు ఖండించిన విషయాన్నిమీడియా ప్రస్తావించగా ఈ విధంగా స్పందించారు. హరీశ్ రావు కేసీఆర్‌కు ఏమౌతారని మీడియాను ప్రశ్నించారు. అదే సందర్భంలో ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏమౌతారన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏం చేశారో... కేసీఆర్‌కు హరీశ్‌రావు కూడా అదే చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ అల్లుళ్ల గిల్లుళ్లు గురిచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసునని అన్నారు. 2018లో కేసీఆర్‌నే హరీశ్ రావు గిల్లాడు అని అందుకే కొన్నాళ్లపాటు ఆయనను పార్టీకి దూరం పెట్టారని మాజీమంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. కేసీఆర్‌ను తిట్టించడం కోసమే ఏపీపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు.



Next Story

Most Viewed