Harishkumar Gupta: ఇకపై పూర్తి స్థాయిలో సేవలు

by Vemula.Srinu Prasad |

ఏపీ ఇంచార్జి డీజీపీగా విధులు నిర్వహిస్తున్నా హరీశ్ కుమార్ గుప్తా ఇకపై పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నారు

Harishkumar Gupta: ఇకపై పూర్తి స్థాయిలో సేవలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఇంచార్జి డీజీపీగా విధులు నిర్వహిస్తున్నా హరీశ్ కుమార్ గుప్తా ఇకపై పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నారు. రాష్ట్రానికి పూర్తి స్థాయి డీజీపీగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మరో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా... ఉమ్మడి రాష్ట్రంలో కీలక పదవుల్లో పని చేశారు. ఖమ్మం ఏఏస్పీగా తొలి పోస్టింగ్ పొందిన ఆయన ఆ తర్వాత మెదక్, పెద్దపెల్లిలోనూ సేవలు కొనసాగించారు. అలా ఆయన చాలా పదవుల్లో కొనసాగారు. 2022 మే నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. జవవరి 31న అప్పటి డీజీపీ తిరుమలరావు పదవీ కాలం ముగియడంతో హరీశ్ కుమార్ గుప్తా రాష్ట్రానికి ఇన్చార్జి డీజీపీగా నియమకమయ్యారు. తాజాగా ఆయనకు పూర్తి స్థాయి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

Next Story