- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Chandrababu: చేనేత సంప్రదాయం గర్వకారణం
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

దిశ డైనమిక్ బ్యూరో : జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మన రాష్ట్రానికి చేనేతకు ఉన్న అనుబంధం గర్విం చదగినదని ఆయన అన్నారు. "మన చేనేత కళాకారులు శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని వస్త్రరూపంలో పునర్జీవింపజేస్తూ, కేవలం గతాన్ని మాత్రమే కాదు భవిష్యత్తును కూడా నేస్తున్నారు." అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చేనేత రంగా న్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కళాకారులకు శిక్షణ, పరికరాలు, మార్కెట్ సదుపాయాలు వంటి అంశాల్లో పూర్తి మద్దతు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మన చేనేత వారసత్వం మన సంస్కృతి, మన గర్వకారణం. దీనిని పరిరక్షించటం మనందరి బాధ్యత. అందుకే ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని, చేనేతను ప్రోత్సహించే దిశగా మనమంతా కలిసి నడవాలి," అని సీఎం పిలుపునిచ్చారు.






