- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hall Tickets: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వాట్సాప్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!
ఇంటర్మీడియట్ (Intermediate) విద్యార్థుల (Inter Students)కు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్ (Intermediate) విద్యార్థుల (Inter Students)కు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎగ్జామ్ హాల్ టికెట్ల (Hall Tickets)ను వాట్సప్ గవర్నెన్స్ (WhatsApp Governance)లో అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులు వాట్సప్ ద్వారా శుక్రవారం నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కళాశాలల హాల్ టికెట్లు నిలిపివేయడం వంటి ఘటనలు వెలుగు చూస్తున్న వేళ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిందండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ (WhatsApp Governance) ద్వారా 161 సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ కలిపి 10 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వాట్సప్ నంబర్ 95523 00009 ద్వారా వారంతా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యా శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్ (Inter Practical) పరీక్షల కేంద్రాల్లో సీసీ టీవీ (CC TV) కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయానికి లింక్ చేయనున్నారు. ఈనెల 10 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.-
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..
- ఫోన్‌లో వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోవాలి.
- సెర్చ్ బాక్స్‌లో ఇంటర్ హాల్ టికెట్ లేదా హాయ్ (Hi) అని టైప్ చేయాలి.
- మనమిత్ర వాట్సాప్ గర్ననెన్స్ నుంచి రిప్లయ్ వస్తుంది.
- ఆ మెసేజ్‌లో విద్యా సేవలు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం సెలక్ట్ హాల్‌టికెట్ ఆప్షన్ వస్తుంది.
- అందుబాటులో ఉన్న హాల్‌టికెట్లు గ్రీన్ సింబల్ కనిపిస్తుంది.
- అందులో అవసరమైన ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
- రూల్ నంబర్, ఫస్టియర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయాలి.
- మీ హాల్‌టికెట్ డిస్‌ప్లే అవ్వగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు






