రూపాయి నోటుకు అరకేజీ చికెన్!

by Muthe.Rajitha |

ఓ చికెన్ సెంటర్ వ్యాపారి తన వ్యాపార అభివృద్ధి కోసం ఒక చిన్న మార్కెటింగ్ ట్రిక్ ఉపయోగించాడు.

రూపాయి నోటుకు అరకేజీ చికెన్!
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ చికెన్ సెంటర్ వ్యాపారి తన వ్యాపార అభివృద్ధి కోసం ఒక చిన్న మార్కెటింగ్ ట్రిక్ ఉపయోగించాడు. ఒక్క రూపాయి నోటు తెచ్చి ఇస్తే.. అరకేజీ చికెన్ ఫ్రీ.. అని బోర్డు పెట్టడంతో కస్టమర్లు చికెన్ షాపుకు పోటెత్తారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో ఉన్న ‘శ్రీ వెంకటేశ్వర చికెన్ సెంటర్’ యజమాని శ్రీనివాసరావు ఈ వినూత్న ఆఫర్‌ను ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం ఒక్క రూపాయి కాగితం నోటు (పాత ఒక రూపాయి నోటు) తెచ్చి ఇస్తే.. 500 గ్రాముల బ్రాయిలర్ చికెన్‌ను ఉచితంగా ఇస్తామని బోర్డు పెట్టారు.

దీంతో షాపు ముందు ఉదయం 8 గంటల నుంచే గుంపులు గుంపులుగా జనం క్యూ కట్టారు. కొందరు 5-10 నోట్లు తెచ్చి చికెన్ ప్యాకెట్లు తీసుకెళ్లారు. ఒక్క రోజులోనే దాదాపు వందకు పైగా పాత ఒక రూపాయి నోట్లు షాపు యజమాని చేతికి చేరాయి. అయితే పాత రూపాయి నోట్లతో తను ఆర్ట్ పీసులు తయారు చేసి అమ్మేబిజినెస్ కోసం ఈ ఆఫర్ పెట్టినట్టు షాపు యజమాని చెప్పారు.

Next Story