- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ ఓటరు డేటా ఇవ్వండి: ఈసీకి వైసీపీ లేఖ
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) కోసం ఉపయోగించబోయే ఓటరు జాబితాను డిజిటల్ ఫార్మాట్‌లో అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కోరారు...

దిశ, వెబ్ డెస్క్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) కోసం ఉపయోగించబోయే ఓటరు జాబితాను డిజిటల్ ఫార్మాట్‌లో అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి(YSRCP State General Secretary, MLC Appi Reddy) కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత కోసం ఓటరు జాబితా పూర్తి వివరాలు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల వారీగా, బూత్‌ల వారీగా ఓటరు జాబితాను సెర్చ్ చేయగలిగే డిజిటల్ ఫార్మాట్‌లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటర్ల అక్రమ తొలగింపులు, డూప్లికేట్ ఎంట్రీలు, ఓటర్ల మార్పిడి వంటి అంశాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, వలసల ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలు, భద్రతా చర్యలను వెల్లడించాలని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కోరారు.
ఓటు హక్కు నుంచి దూరం చేయకూడదు
‘‘సరైన ప్రక్రియ లేకుండా ఏ ఒక్క నిజమైన ఓటరునూ ఓటు హక్కు నుండి దూరం చేయకూడదు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ కోసం SIR ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధిత డిజిటల్ ఓటరు డేటాను తక్షణమే అందించాలి.’’ అని ఎన్నికల అధికారిని అప్పిరెడ్డి కోరారు.






