ఏపీలో గవర్నర్ పాలన విధించండి: రాజ్యసభలో వైసీపీ ఎంపీ డిమాండ్

by Vemula.Srinu Prasad |

ఏపీలో జరుగుతున్న ఘటనలను వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లారు...

ఏపీలో గవర్నర్ పాలన విధించండి: రాజ్యసభలో  వైసీపీ ఎంపీ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో గవర్నర్ పాలన విధించాలని రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్(YSRCP MP Pilli Subhash Chandra Bose) డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు జోగి రమేశ్(Jogi Ramesh), అంబటి రాంబాబు(Ambati Rambabu) ఇళ్లపై జరిగిన ఘటనలను ఆయన పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తావించారు. రాజ్యసభ(Rajya Sabha)లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరిగాయని, లా అండ్ ఆర్డర్ కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమపై ఆధారపడి ఉందని ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రధానమంత్రి మోదీ జోక్యం చేసుకుని గవర్నర్ పాలన విధించాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి చేశారు.

Next Story