అతడితో జాన్వీ కపూర్ పెళ్లి ఫిక్సా.. ఒక్క ఫొటోతో ప్రేమను కన్ఫర్మ్ చేసిన యంగ్ బ్యూటీ!

by Mallepaka Hamsa |

"నేను ఎక్కడైనా తప్పిపోతే, దయచేసి నన్ను శిఖర్ పహారియాకు అప్పగించండి" అని ఉండటం విశేషం.

అతడితో జాన్వీ కపూర్ పెళ్లి ఫిక్సా.. ఒక్క ఫొటోతో ప్రేమను కన్ఫర్మ్ చేసిన యంగ్ బ్యూటీ!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు నిత్యం ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే గత కొద్ది కాలంగా ఆమె శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. వారు కలిసి బయట కనిపించినా లేదా సోషల్ మీడియాలో ఒకరి పోస్టులపై ఒకరు స్పందించినా అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి నెలకొంటుంది. నిత్యం వీరిద్దరు పలు ప్రాంతాల్లో తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. వీరి ప్రేమ వార్తలు ఎన్ని వచ్చినప్పటికీ అధికారికంగా మాత్రం స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, జాన్వీ కపూర్ ధరించిన ఒక విభిన్నమైన నైట్‌సూట్ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌‌లో చర్చనీయాంశంగా మారింది.

ఆ దుస్తులపై ఉన్న ఒక సరదా మెసేజ్, శిఖర్ పట్ల ఆమెకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఆమె పింక్ కలర్ నైట్‌సూట్‌తో పాటు గ్రే కలర్ జాకెట్ ధరించి కనిపించారు. అయితే, ఆ నైట్‌సూట్‌పై రాసి ఉన్న ప్రత్యేకమైన టెక్స్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. దానిపై "నేను ఎక్కడైనా తప్పిపోతే, దయచేసి నన్ను శిఖర్ పహారియాకు అప్పగించండి" అనిఉండటం విశేషం. ఇక ఈ క్రేజీ అండ్ క్యూట్ పోస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. దీనిని చూసిన అభిమానులు రిలేషన్‌షిప్ గోల్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా వీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయమని అనుకుంటున్నారు. అయితే జాన్వీ అలా చేయడం ఇదే మొదటి సారి కాదు.. ఆమె గతంలో కూడా శిఖర్ పేరు ఉన్న నెక్లెస్‌ను ధరించి కనిపించిన సంగతి తెలిసిందే.

Next Story