ఫేక్ ప్రచారాలకు వైకాపా పర్ఫెక్ట్ అడ్రస్ గా మారింది : ఎమ్మెల్యే నసీర్

by Thanuru Gopichand |

ఫేక్ ప్రచారాలకు వైకాపా కేరాఫ్ అడ్రస్ గా మారిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ (Guntur East) ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు.

ఫేక్ ప్రచారాలకు వైకాపా పర్ఫెక్ట్ అడ్రస్ గా మారింది : ఎమ్మెల్యే నసీర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫేక్ ప్రచారాలకు వైకాపా కేరాఫ్ అడ్రస్ గా మారిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ (Guntur East) ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. ఆ పార్టీ పూర్తిగా ఫేక్ ప్రచారాలకు ప్రతీకగా మారిపోయిందని విమర్శించారు. కర్నూలు బస్సు అగ్ని ప్రమాదాన్నీ కూడా రాజకీయంగా వాడుకుంటూ ఫేక్ ప్రచారానికి తెరలేపడాన్ని తప్పుబట్టారు. ఒక బైకర్ మద్యం సేవించి బైకు నడిపి ప్రమాదానికి కారణమైతే, దాన్ని కూడా బెల్టు షాపులతో కొంప ముంచిన ప్రభుత్వం అంటూ వైకాపా (YCP) తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. విషాద ఘటనలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం వైకాపాకు అలవాటుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని భ్రమరావతి అంటూ వైకాపా ఫేక్ ప్రచారాలు చేసిందన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ (Insider Trading) పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నించిన ఘనత కూడా వైకాపాకు దక్కుతుందన్నారు. పింక్ డైమండ్ అంటూ రాష్ట్ర ప్రజలను వైకాపా గతంలో తప్పుదోవ పట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా కోడి కత్తి కేసు అంశంలో ఏమైందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్న ఫేక్ ప్రచారాలను పుట్టించడమే కాకుండా వాటిని నమ్మించేందుకు వైకాపా యత్నించడం సరికాదన్నారు. అబద్ధాలు - అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడమే వారి అసలు లక్ష్యమా అని ఎమ్మెల్యే నసీర్ ప్రశ్నించారు.

Next Story