మేము 11 ఇస్తే.. మీరు నాలుగైనా ఇవ్వలేరా?: ఉద్యోగుల సమస్యలపై జగన్ ప్రశ్నల వర్షం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-23 08:37:03  IST  )

ఉద్యోగుల సమస్యలపై జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు..

మేము 11 ఇస్తే.. మీరు నాలుగైనా ఇవ్వలేరా?: ఉద్యోగుల సమస్యలపై జగన్ ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: తమ హయాంలో ఉద్యోగులకు 11 డీఏలు ఇచ్చామని, కూటమి ప్రభుత్వంలో 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తాడేపల్లి వైసీపీ క్యాంపు ఆఫీసు(Tadepalli YCP Camp Office)లో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతోందని, ఉద్యోగుల సమస్యలను మాత్రం పెండింగ్ లోనే పెట్టిందని విమర్శించారు. ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేపడితే కంటి తుడుపుగా ఓ డీఏ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఏం పండ చేసుకోవాలని ఉద్యోగులు ప్రశ్నిస్తే అప్పుడు జీవోను సవరించారని గుర్తు చేశారు. 4 పోలీసుల సరెండర్ లీవ్స్ పెడ్డింగులోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు ఉద్యోగులు మోసపోయారని వైఎస్ జగన్ ఆరోపించారు.

READ MORE ...

నందమూరి బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Next Story