సొంత ఇంటికి వచ్చిన వంశీకృష్ణ.. పవన్ కల్యాణ్ హర్షం

by Vemula.Srinu Prasad |

వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ..

సొంత ఇంటికి వచ్చిన వంశీకృష్ణ.. పవన్ కల్యాణ్ హర్షం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. తన అనుచరులతో పవన్‌ను కలిసిన ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వంశీ కృష్ణను పవన్ కల్యాణ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆకాంక్షించి గత ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు వైసీపీలో చేరారన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖలో అభివృద్ధి జరగకపోవడంతో మళ్లీ తిరిగి తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. వంశీకృష్ణ జనసేనలోకి రావడం సొంత ఇంటికి వచ్చి నట్టుందని తెలిపారు. ఉత్తరాంధ్రలో జనసేన బలపడుతోందన్నారు. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కాగా ఉత్తరాంధ్రకు చెందిన వంశీకృష్ణ గతంలో ప్రజారాజ్యంలో పని చేశారు. యువరాజ్యం తరపున తరపున అప్పటి ప్రభుత్వంపై పవన్ కల్యాణ్‌తో పాటు పోరాటం చేశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వంశీ కృష్ణ వైసీపీలో చేరారు. విశాఖ నుంచి ఎమ్మెల్సీగా పని చేశారు. చాలా రోజుల తర్వాత వంశీకృష్ణ జనసేనలో చేరడంతో సొంత ఇంటికి వచ్చినట్టైంది. దీంతో పవన్ కల్యాణ్ సైతం హర్షం వ్యక్తం చేశారు. ఏనమ్మకంతో అయితే వంశీకృష్ణ జనసేనలో చేరారో.. పవన్ కల్యాణ్ అంతటి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతానికి వంశీకృష్ణ మనస్ఫూర్తిగా కృషి చేస్తారని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.

Next Story