- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబటికి అది మంచి పద్ధతి కాదు: కేంద్రమంత్రి పెమ్మసాని
అంబటికి అది మంచి పద్ధతి కాదని కేంద్రమంత్రి పెమ్మసాని సూచించారు ,,

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్యేలు డమ్మీలని మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. గుంటూరులో పర్యటించిన ఆయన అంబటి అలా మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో అంబటి అలా మాట్లాడాడని, దాన్ని తాను అర్థం చేసుకోగలనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అంబటితో పాటు వైసీపీ నేతలకు చేసిన కామెంట్లను తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కానీ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంపై అంబటిలా తాను మాట్లాడాలేనన్నారు. రెండు సంవత్సరాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి తొలగింపు కోసం ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి తొలగింపు కొంచెం జఠిలమైన సమస్యేనని చెప్పారు. ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేసేలోపే మిగిలిన బ్రిడ్జిని సైతం తొలగిస్తామని చెప్పారు. శంకర్ విలాస్ సెంటర్ నిర్మాణం వల్ల నష్టపోయిన స్థానికులకు పరిహారం చెల్లిస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రబాబు స్పష్టం చేశారు.






