- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ కేసులో కీలక పరిణామం... కస్టడీలో వాసుదేవరెడ్డి ఉక్కిరిబిక్కిరి
ఏపీ లిక్కర్ కేసులో ఏ2 నిందితుడు వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కూడా కస్టడీకి తీసుకుని విచారించారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(AP Liquor Case)లో ఏ2 నిందితుడు వాసుదేవరెడ్డి(Vasudeva Reddy)ని సిట్ అధికారులు రెండో రోజు కూడా కస్టడీ(Custody)కి తీసుకుని విచారించారు. కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించారు. దాదాపు 100కి పైగానే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. దీంతో వాసుదేవరెడ్డి ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది.
జగన్ ప్రభుత్వంలో...
కాగా జగన్ ప్రభుత్వం(Jagan Govt)లో లిక్కర్ అమ్మకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే లిక్కర్ అమ్మకాల్లో కుంభకోణం జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించి కేసును సిట్ కు అప్పగించడంతో విచారణ ముమ్మరంగా చేపట్టింది. దీంతో పలువురు వైసీపీ నేతలు ఈ కుంభకోణంలో ఉన్నట్లు గుర్తించి వారందరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో పలువురు బెయిల్ పై విడుదలయ్యారు. మరికొందరు రిమాండ్ ఖైదీగా జైలులోనే ఉన్నారు. వాసుదేవరెడ్డి సైతం రిమాండ్ ఖైదీగా గుంటూరు జైలులో ఉన్నారు. అయితే ఈ కేసులో మరింత విచారణ కోసం సిట్ అధికారులు వాసుదేవరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అనుమతి లభించింది.
ముగిసిన విచారణ
ఈ మేరకు వాసుదేవరెడ్డిని రెండు రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. మద్యం ముడుపుల్లో అంతిమ లబ్ది ఎవరికి చేకూరిందంటూ సిట్ అధికారులు విచారించారు. అయితే ఈ విచారణలో వాసుదేవరెడ్డి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు శుక్రవారం విచారణ ముగియడంతో తిరిగి గుంటూరు జైలుకు తరలించారు.






