- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి హెచ్చరిక: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సోమవారం పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సోమవారం పలు చోట్ల వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Weather Department Officers) వెల్లడించారు. ఉత్తర కోస్తా(North coast), ఉభయ గోదావరి జిల్లాల(Both Godavari districts)తో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో వాతావరణం మేఘావృతమైవుతోందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ సరిహద్దు జిల్లాలు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని, పొలాల్లో పనులు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Next Story






