- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హత్యలు వారే చేయిస్తారు.. పరామర్శలూ వారే చేస్తారు: వైసీపీ నేతలపై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ హత్య వెనుక వైఎస్సార్సీపీ నేతల హస్తం ఉందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు వారు ఎన్ని నాటకాలైనా ఆడతారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వివేకా హత్య తరహాలోనే నాటకాలు..
గతంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత వైసీపీ నేతలు ఎలాంటి నాటకాలు ఆడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారని మంత్రి గుర్తుచేశారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు ఏ విధంగా బరితెగించారో అందరికీ తెలిసిందేనన్నారు. ‘హత్యలు వీళ్లే చేయిస్తారు.. తిరిగి పరామర్శలూ వీళ్లే చేస్తారు. అసలు నేరస్థులను కాపాడేందుకు ప్రజలను, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించేలా కారణాలు వెతుకుతారు’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
అసలు ఎవరీ పెద్ద దస్తగిరి?
హత్యకు గురైన పెద్ద దస్తగిరి నేపథ్యం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. అతడు కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలకు అత్యంత సన్నిహితుడని.. అలాగే తాడేపల్లి పెద్దల వద్ద కూడా అతనికి మంచి చనువు ఉందన్నారు. పులివెందులలో జరిగే రహస్య మంతనాల్లో దస్తగిరి పాత్ర తప్పనిసరిగా ఉంటుందని కడప జిల్లా వాసులందరూ చెబుతుంటారని ఆయన పేర్కొన్నారు. ‘రాత్రి చీకట్లో దారుణంగా చంపేస్తారు.. ఉదయం కాగానే ఏమీ తెలియనట్లు వెళ్లి పరామర్శ నాటకాలు ఆడతారు’ అంటూ వైసీపీ వైఖరిని మంత్రి ఎండగట్టారు.






