విధుల్లో నిర్లక్ష్యం.. గుంటూరు మున్సిపల్ సిబ్బందిపై వేటు

by Vemula.Srinu Prasad |

విధుల్లో నిర్లక్ష్యం వహించిన గుంటూరు మున్సిపాలిటీలో సిబ్బందిపై వేటు పడింది..

విధుల్లో నిర్లక్ష్యం.. గుంటూరు మున్సిపల్ సిబ్బందిపై వేటు
X

దిశ, వెబ్ డెస్క్: విధుల్లో నిర్లక్ష్యం వహించిన గుంటూరు మున్సిపాలిటీలో సిబ్బందిపై వేటు పడింది. నగరంలో నిర్మాణం అవుతోన్న గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ విషయంలో అధికారుల అలసత్వం వహించారని కమిషనర్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసు ఇచ్చినప్పటికీ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్‌లో నిర్మాణ పనులు జరగడంపై ఆయన సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ప్లానింగ్ కార్యదర్శి, టీపీబీవోలను విధులను నుండి సస్పెండ్ చేశారు. పర్యవేక్షణ లోపంపై టీపీఎస్, ఏసీపీ, డీసీపీ, సీపీలకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసులు ఇచ్చినా కూడా పనులు చేపట్టిన భవన యజమానిపై త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. భవన నిర్మాణ పనులపై అందిన ఫిర్యాదుల మేరకు ఏర్పాటు చేసిన కమిటీ ప్రాథమిక నివేదక అందజేయడంతో క్షేత్ర స్థాయిలో పరిశీలన కమిషనర్ చర్యలకు దిగారు.

Next Story