- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం(AP Government) పనిచేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravi Kumar) చెప్పారు.

దిశ, మేదరమెట్ల: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం(AP Government) పనిచేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravi Kumar) చెప్పారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం కొరిశపాడు గ్రామంలో మంత్రి గొట్టిపాటి, కలెక్టర్ వెంకట మురళి తో కలిసి పర్యటించారు.పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. అద్దంకి నియోజకవర్గంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. అందులో భాగంగా లింక్ రోడ్డులు నిర్మాణం కు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అర్హులైన పెన్షన్ దారులకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
ప్రధానం కొరిశపాడు మండలంలో సాగునీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ముందుగా గ్రామంలో రూ. 1.66కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి చెప్పారు. దండు రామకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,500 సైకిళ్ళు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పల్లెపందుక కింద రూ.2.30 లక్షల వ్యయంతో నిర్మించిన cc రోడ్డులను ప్రారంభించారు.
15 మంది దివ్యాంగులకు రూ.15 లక్షలు విలువైన 15 ట్రై స్కూటీలను లబ్ధిదారులకు అందజేశారు. ఐతే స్కూటీ లబ్ధిదారులు సుమారు గంట పాటు ఎండకు, ఉక్కపోతకు గురయ్యారు. కనీసం వారికి ఒక షామియానా కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. దివ్యాంగులు కొంతమేర ఇబ్బంది పడ్డారు. పలు సమస్యలపై అర్జీదారులు , అర్జీలు ఇచ్చారు. వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






