ఫిబ్రవరిలో డీఎస్సీ.. ప్రభుత్వం కసరత్తు..?

by Vemula.Srinu Prasad |

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కూడా డీఎస్సీ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది..

ఫిబ్రవరిలో డీఎస్సీ.. ప్రభుత్వం కసరత్తు..?
X

దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కూడా డీఎస్సీ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. మొత్తం 2500 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నట్లు ఇప్పటికే గుర్తించింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. ఈ డీఎస్సీలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్‌ నాలెడ్స్‌కు సంబంధించి ఎగ్జామ్ నిర్వహించే యోచనలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఖాళీలను భర్తీ చేయాలని విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో పోస్టుల ఖాళీలు, రిజర్వేషన్, పరీక్ష వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. డీఎస్సీలో కొత్తగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ అవగాహన, డిజిటల్ లెర్నింగ్ వంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాలన్నింటిపై త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి.

Next Story