- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు.. అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు
గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ...

దిశ, వెబ్ డెస్క్: 77వ భారత గణతంత్ర దినోత్సవ(Indian Republic Day) వేడుకలను రాష్ట్ర రాజధాని అమరావతి(Amaravati)లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్(Chief Secretary K. Vijayanand) ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహక ఏర్పాట్లపై సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈనెల 26న ఉదయం రాజధానిలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయంతం చేయాలని సూచించారు. వేడుకల ప్రాంగణంలో తగిన తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగు దొడ్లు, బారి కేడింగ్, ట్రాఫిక్ నియంత్రణపై అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
విద్యుత్ దీపాలతో ముఖ్య భవనాల అలంకరణ
అలాగే లోక్ భవన్, హైకోర్టు, అసెంబ్లీ, రాష్ట్ర సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం సహా ఇతర ముఖ్య భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. పోలీస్ శాఖ తరపున తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. అంతేగాక సెరిమోనియల్ పెరేడ్‌కు తగిన అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని ఆయా శాఖల వారీ శకటాల ఏర్పాటు ప్రదర్శనకు చర్యలు తీసుకోవాలన్నారు. శకటాలకు సంబంధించి గురువారం నాటికి ధీమ్స్‌ను సిద్ధం చేసి పంపాలని చెప్పారు. విద్యుత్ శాఖ నిరంతరం విద్యుత్ సరఫరాకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ వేడుకల ప్రాంగణంలో అత్యవసర వైద్య బృందాలను, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని సీఎస్ ఆదేశించారు.






