- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుగ్గిరాలలో దారుణం.. యువకుడిని నరికి చంపిన దుండగులు
గుంటూరు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య(Murder) కలకలం రేగింది...

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District)లో వ్యక్తి(Man) దారుణ హత్య(Murder) కలకలం రేగింది. దుగ్గిరాల మండలం(Duggirala Mandal) చిలువూరు(Chiruvuru)లో ప్రభాస్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. మంగళగిరి మండలం పెద్దవడ్లపూడికి చెందిన ప్రభాస్.. చిలువూరుకు వచ్చాయి. అయితే దుండగులు కాపు కాసి మరి కత్తులతో నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభాస్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అయితే ఈ మర్డర్ ఎందుకు జరిగిందనే సస్పెన్స్ కొనసాగుతోంది. పెద్దవడ్లమూడికి చెందిన ప్రభాస్..చిలువూరుకు ఎందుకు వచ్చారు. హత్యకు గల కారణాలేంటనే అంశాలు తెలియాల్సి ఉంది.






