- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా డీఎస్సీ తెచ్చిన వైభోగం.. ఎగిరి గంతెస్తున్న ఆ పాఠశాలల విద్యార్థులు
కారంపూడి మండల పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించనుంది.

దిశ, కారంపూడి : కారంపూడి మండల పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించనుంది. మండల వ్యాప్తంగా మొత్తం 25 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఇందులో ఎలిమెంటరీ స్కూల్‌లలో 8, హై స్కూల్‌లలో 17 పోస్టులు ఉన్నాయి. ఉపాధ్యాయులు లేక కొన్ని సబ్జెక్ట్‌లకు విద్యాబోధన లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మెగా డీఎస్సీ ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 19 తేదీన 25 మంది ఉపాధ్యాయుల సెలక్షన్ కాఫీలు అందజేయనున్నారు. దీంతో మండలంలోని విద్యార్థులకు తగిన ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చి, విద్యాభ్యాసంలో మెరుగుదల సాధ్యమవుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల హర్షం
ఇన్నాళ్లుగా కొన్ని సబ్జెక్ట్‌లకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు సరైన బోధన అందకపోవడం వల్ల అభ్యాసంలో వెనుకబాటుతనానికి గురయ్యారు. ఖాళీ పోస్టులు భర్తీ కావడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, విద్యా ప్రమాణాలను మెరుగు పరచగలమని అధికారులు వెల్లడించారు. మండల విద్యా వ్యవస్థకు ఇది మంచి ముందడుగుగా నిలుస్తుందని, ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
ఎంఈఓ రవి కుమార్ ఏమన్నారంటే..
దీనిపై ఎంఈఓ రవి కుమార్‌ను దిశ పత్రిక రిపోర్టర్ వివరణ కోరగా 19న సెలక్షన్ కాఫీలు ఇస్తామన్నారు. మండలంలో 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన వారికి వారం రోజుల పాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. దసరా పండుగ తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతారని ఆయన వెల్లడించారు.






