MLC Anuradha: చంద్రన్నతోనే మహిళా సంక్షేమం

by Vemula.Srinu Prasad |

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు...

MLC Anuradha: చంద్రన్నతోనే మహిళా సంక్షేమం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. కొత్త పిచ్చోడు పొద్దరెగడన్న చందంగా ఎప్పుడో ఒకసారి సీఎం బయటకొచ్చి అంకెల గారడీతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయంలో బ్రాహ్మణులకు రూ.280 కోట్లు, ఆర్యవైశ్యులకురూ. 50 కోట్లు, క్షత్రియులకు 50 కోట్లు ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. ఈబీసీ పథకం పేరుతో పచ్చి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగు సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టారని, ఈబీసీలకు ఒక్క రూపాయి అయినా కేటాయించారా? అని ఎమ్మెల్సీ నిలదీశారు. మహిళలపై 52 వేల నేరాలు జరిగితే ఎంతమంది నిందితులపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా సంక్షేమం చంద్రన్నతోనే సాధ్యమని ప్రజలకు అర్థమైందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు.

Next Story