Mangalagiri: జగన్‌ను సాగనంపుదాం...!

by Vemula.Srinu Prasad |

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు....

Mangalagiri: జగన్‌ను సాగనంపుదాం...!
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 17 ఏళ్ల దళిత బాలిక గ్యాంగ్ రేప్‌కి గురైందని, గతంలో రాజమండ్రిలో ఇదే రకంగా దళిత యువతి లైంగిక దాడికి గురైందని గుర్తు చేశారు. సీఎం జగన్ నివాసానికి సమీపంలో మరో దళిత యువతిని తనకు కాబోయే భర్త ముందే గ్యాంగ్ రేప్ చేశారన్నారు. ఈ గ్యాంగ్ రేప్‌లో నిందితుడైన వెంకట్ ‌రెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం వైసీపీ అసమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా లభ్యం కావడం, కల్తీ మద్యంతో మృతి చెందుతున్న ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన జగన్ రెడ్డిని సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Next Story