- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు... కలెక్టరుకు ఫిర్యాదు
అవినీతికి పాల్పడి అక్రమంగా ఫీజులు వసూలు చేయడంతో పాటు విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారని చీరాల ఏపీ మోడల్ కాలేజీ అండ్ హై స్కూల్ ప్రిన్సిపల్ జె.సరళ, వైస్ ప్రిన్సిపల్ గుర్రం సామ్యూల్ జాన్ పై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

దిశ ప్రతినిధి, బాపట్ల: అవినీతికి పాల్పడి అక్రమంగా ఫీజులు వసూలు చేయడంతో పాటు విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారని చీరాల ఏపీ మోడల్ కాలేజీ అండ్ హై స్కూల్ ప్రిన్సిపల్ జె.సరళ, వైస్ ప్రిన్సిపల్ గుర్రం సామ్యూల్ జాన్ పై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వారితో పాటు వారికి సహకరిస్తున్న కొంతమంది ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తద్వారా కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలంటున్నారు. అక్రమంగా వసూలు చేసిన అదనపు ఫీజులను తిరిగి విద్యార్థులకు తిరిగి చెల్లించే విధంగా తగు చర్యలు చేపట్టాలని విన్నవిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఏపీ మోడల్ కాలేజీ అండ్ హై స్కూల్ కమిటీ చైర్మన్ డి.రాంబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు షేక్ షేహనాజ్, కట్టా భూలక్ష్మి జిల్లా కలెక్టర్ ను కలిసి తమ ఫిర్యాదును అందించారు.
ఏపీ మోడల్ కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయని వారు పేర్కొన్నారు. ఫిర్యాదులపై విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టారన్నారు. దీంతో ప్రిన్సిపాల్ పది రోజులు సెలవు పెట్టి వెళ్లిపోయారన్నారు. ఈ క్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గుర్రం శామ్యూల్ జాన్ విద్యార్థులను వేధిస్తున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అంతేకాకుండా క్లాసులు నిర్వహించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం లేదని కలెక్టరుకు తెలిపారు.
ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక విద్యార్థులు రోడ్డెక్కిన విషయాన్ని గుర్తు చేశారు. అయినాకూడా ఉన్నతాధికారుల నుంచి సరైన స్పందన లభించలేదన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించకపోగా విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లించేలా సమస్య పరిష్కరిద్దామని బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల తీరు పట్ల విద్యా కమిటీ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.






