- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్నాడు జిల్లాలో ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
తెలుగు రాష్ట్రాల ప్రజలను వరుస బస్సు ప్రమాదాలు (Bus Accidents) భయాందోళనకు గురి చేస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలను వరుస బస్సు ప్రమాదాలు (Bus Accidents) భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రివేళ బస్సు ప్రయాణమంటేనే హడలెత్తేలా పరిస్థితులను మారుస్తున్నాయి. ప్రైవేట్, ఆర్టీసీ బస్సులనే తేడా లేకుండా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణమంటేనే ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగానే మరొక ట్రావెల్స్ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా రాజుపాలెం, రెడ్డిగూడెం (Reddy Gudem) దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి వెళ్లింది. గుంతలో ఉన్న పైపు పైకి బస్సు ఒరిగిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తోంది. దాన్ని మార్నింగ్ ట్రావెల్స్ కు (Morning Travels) చెందిన బస్సుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ఎమర్జెన్సీ విండో (Emergency Window) నుంచి బయటకు వచ్చారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. బస్సు ఎక్కాలంటే జనం వణికిపోతున్నారు.






