Sensational Verdict: కూతురిపై అత్యాచారం.. తండ్రికి మరణించే వరకు జైలు శిక్ష

by Vemula.Srinu Prasad |   (  Updated:2022-12-17 15:42:53  IST  )

గుంటూరు జిల్లా లాలాపేట రేప్ కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి నాగరాజుకు మరణించే వరకు జైలు శిక్ష విధించింది..

Sensational Verdict: కూతురిపై అత్యాచారం.. తండ్రికి మరణించే వరకు జైలు శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా లాలాపేట రేప్ కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి నాగరాజుకు మరణించే వరకు జైలు శిక్ష విధించింది. కూతురుని బంధించిన తండ్రి నాగారాజు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బయటకు పొక్కకుండా అబార్షన్ చేయించే ప్రయత్నం చేశారు. తట్టుకోలేక బాలిక బలవన్మరణానికి పాల్పడ్డారు. బాలిక గర్భంలోని పిండానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయడంతో నాగరాజు అఘాయిత్యం బయటపడింది. ఈ కేసును విచారించిన పోక్సో కోర్టు తండ్రి నాగరాజ మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

Next Story