- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ పర్మిషన్లపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్‌గా ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేష్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (APFDC) వైస్ ఛైర్మన్‌గా ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేష్(Film Director Meher Ramesh) అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Mla Nandamuri Balakrishna), రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) నూతన వైస్ ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపి, బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతామని బోర్డు ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.
షూటింగ్ పర్మిషన్లపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమ ప్రస్తుత పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ, సినిమాలు సకాలంలో పూర్తి కాకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగులు సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతోమంది సినిమా కార్మికులు, యూనియన్లు ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి షూటింగ్ అనుమతులన్నీ 'సింగిల్ విండో' విధానంలో, ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ సహకారాన్ని కోరుతున్నాం
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపు 70 శాతం కలెక్షన్లు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బాలకృష్ణ తెలిపారు. సినీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు రాష్ట్రాల సమన్వయంతో పరిశ్రమను ఉమ్మడిగా బలోపేతం చేయవచ్చని, కొత్త మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఏపీలో సినిమా రంగానికి పూర్వవైభవం వస్తుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.






