టాప్-3లో ఉండటమే మా లక్ష్యం: నారా లోకేశ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-07 13:19:49  IST  )

అమరావతి క్వాంటమ్ వ్యాలీ టాప్-3లో ఉండటమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు...

టాప్-3లో ఉండటమే మా లక్ష్యం: నారా లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి క్వాంటమ్ వ్యాలీ(Amaravati Quantum Valley) టాప్-3లో ఉండటమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు(Cm Chandrababu) చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ క్వాంటం వ్యాలీతో యువతికి భారీగా ఉద్యోగాలు వస్తాయన్నారు. క్వాంటం వ్యాలీతో రాష్ట్రంలో చాలా మార్పులు వస్తాయని లోకేశ్ తెలిపారు. ఇండియా ఐటీ రెవెల్యూషన్‌కు హైదరాబాద్ కారణమని, క్వాంటం రెవెల్యూషన్‌కు అమరావతి కారణమవుతుందని మంత్రి లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story