ఆలయ శంకుస్థాపనకు హాజరైన మంత్రి నారా లోకేష్

by Thanuru Gopichand |

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం కుంచనపల్లిలో శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణా దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి ఆలయ పున: నిర్మాణ పనులు భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమయ్యాయి.

ఆలయ శంకుస్థాపనకు హాజరైన మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి మండలం కుంచనపల్లిలో శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణా దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి ఆలయ పున: నిర్మాణ పనులు భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమయ్యాయి. ఆలయ పున: నిర్మాణ శంకుస్థాపన (Foundation) మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఉత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఆలయ పున: నిర్మాణానికి (Renovation) శంకుస్థాపన చేశారు. దేవతామూర్తులను దర్శించుకొని కానుకలను సమర్పించారు. వేద పండితుల ఆశీర్వచనాలను పొందారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

దేవాలయాల జీర్ణోద్ధరణ, పునర్నిర్మాణం వల్ల పుణ్యం లభిస్తుందని. ప్రజల్లో భక్తి భావం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతతకు, ధార్మిక చైతన్యానికి దేవాలయం వేదికగా నిలుస్తుందంటున్నారు. అందుకే ప్రతి గ్రామంలోనూ, వీధిలోనూ రామాలయం గానీ, శివాలయం గానీ, గ్రామ దేవతల ఆలయాలు గానీ ఉంటాయని చెబుతున్నారు. దేవాలయాలు కేవలం పూజాధికాలకే పరిమితం కాదని.. అవి శక్తి చైతన్య కేంద్రాలని చెబుతున్నారు. దేవాలయ పునర్నిర్మాణ పనులు జరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story