- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విదేశాలకు భారీగా రేషన్.. మంత్రి నాదెండ్ల టార్చిలైట్ వెలుగుల్లో కనిపించిన స్కాం
by Naga Rani Yarlagadda |
మంత్రి నాదెండ్ల మనోహర్ నల్లజర్లలో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం లభ్యమయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల రాత్రివేళ చేపట్టిన తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం స్కాం వెలుగుచూసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నల్లజర్లలో ఉన్న శ్రీ వెంకట సత్య రైస్ మిల్లులో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మూసి ఉన్న గోడౌన్ ను తెరిపించి చూడగా.. అక్కడ భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వచేసినట్లు కనిపించింది. టార్చిలైట్ వేసి పరిశీలించగా.. అక్కడున్న బియ్యం సంచులపై విదేశీ కంపెనీల పేర్లు ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా విదేశాలకు తరలించేందుకు రేషన్ బియ్యాన్ని అక్కడ నిల్వ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై రైస్ మిల్లు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేస్తున్నారు. అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
Next Story






