అప్పటి నుంచే హిందుమతంపై విధ్వంసం: మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

హిందుమతంపై 2005 నుంచే విధ్వంసం మొదలైందని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు...

అప్పటి నుంచే హిందుమతంపై విధ్వంసం: మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: హిందుమతంపై 2005 నుంచే విధ్వంసం మొదలైందని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ కల్తీ నెయ్యిపై 2022లో ఇచ్చిన సీఎఫ్టీఆర్ఐ నివేదికను అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తొక్కిపెట్టారని ఆయన ఆరోపించారు. జంతు కొవ్వుపై ఎన్డీడీబీ రిపోర్టును ముఖ్యమంత్రి బయటపెడితే అది తప్పా అని ప్రశ్నించారు. ఏకసభ్య కమిషన్ విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించిందని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెయ్యి సరఫరా టెండర్ల నిభందనలు మార్చేశారన్నారు. రూ. 250 కోట్ల స్కామ్ జరిగిందని సీబీఐ సిట్ చార్జి‌షీట్‌లో పేర్కొందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దేవుడిపై నమ్మకం, విశ్వాసం లేదని విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, చెవిరెడ్డి ఒత్తిడితోనే టీటీడీ నెయ్యి సరఫరా టెంర్లు నిబంధనలు మార్చారని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి విమర్శించారు. 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏడు కొండలు కాదని, రెండు కొండలు అని జీవీ ఇచ్చారని మంత్రి ఆనం గుర్తు చేశారు.

Next Story