సీఎంగా చంద్రబాబును కాపులు ఇష్టపడటంలేదు: అంబటి

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-03-02 11:08:23  IST  )

టీడీపీ, జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....

సీఎంగా చంద్రబాబును కాపులు ఇష్టపడటంలేదు: అంబటి
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం రేసులో లేకపోవడంతో నేతలందరూ జనసేనను వదిలి వైసీపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ- జనసేన సభతో జెండా ఎత్తేశారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను ఢీకొట్టడం సాధ్యం కాదని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు తెలిసిపోయిందన్నారు. లెక్కల్లో 1 ప్లస్ 1 రెండు అవుతుందని, కానీ రాజకీయాల్లో జీరో అయిందని ఎద్దేవా చేశారు. పవన్ డైలాగులు సినిమాల్లో పని చేస్తాయని.. రాజకీయాల్లో పని చేయవని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కాపులు ఇష్టపడటంలేదని మంత్రి అంబటి వెల్లడించారు. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అయితే ఆలోచించేవారని ఆయన తెలిపారు. టీడీపీ, జనసేన పొత్తుపై కాపుల్లో అసంతృప్తి ఉందన్నారు. అందువల్ల సీఎం జగన్ వెంటే ఉండాలని కాపు నాయకులు నిర్ణయించుకున్నారని తెలిపారు. వైసీపీ సిద్ధం సభలను చూసి టీడీపీ-జనసేన నాయకులు చల్లబడ్డారని ఎద్దేవా చేశారు. ఈ 10న జరిగే సిద్ధం సభతో ప్రతిపక్షాలకు రాజకీయ ముగింపేనని అంబటి వ్యాఖ్యానించారు.

Read More..

వైసీపీ మేనిఫెస్టో ఆరోజే!.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన

Next Story