మంగళగిరి | కురగల్లు సోసైటీలో 9 కోట్ల భారీ స్కాం!

by Thanuru Gopichand |

మంగళగిరి మండలంలోని కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకారం పరపతి సంఘం (పీఏసీఎస్) లో భారీ స్కాం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మంగళగిరి | కురగల్లు సోసైటీలో 9 కోట్ల భారీ స్కాం!
X

దిశ, మంగళగిరి : మంగళగిరి మండలంలోని కురగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకారం పరపతి సంఘం (పీఏసీఎస్) లో భారీ స్కాం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజధాని గ్రామాల్లో ఒకటైన కురగల్లులో రైతులు పీఏసీఎస్ లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేశారు. అయితే సొసైటీ సీఈఓ రమేశ్ బాబు రైతులను మోసం చేశారని.. వారికి నకిలీ డిపాజిట్ పత్రాలను అందజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కురగల్లు సొసైటీకి కొత్త సీఈఓ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కొంత కాలంగా రైతులు రమేశ్ బాబుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే కొన్ని నెలల కిందటే రమేశ్ బాబును సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ.9కోట్ల స్కారం జరిగినట్లు అనుమమానాలున్నాయి. దీంతో శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో రైతులు మంగళగిరి రూరల్ పోలీసు స్టేషనుకు చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.

Next Story