ఎంపీడీఓ నుంచి డీఎస్పీగా జావేద్

by Thanuru Gopichand |

గ్రూప్ వన్ పరీక్షల్లో సత్తా చాటిన యువకుడు.

ఎంపీడీఓ నుంచి డీఎస్పీగా జావేద్
X

దిశ ప్రతినిధి, నరసరావుపేట : నరసరావుపేట వైసీపీ కీలక నేత, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ హనీఫ్ అల్లుడు జావేద్ గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటారు. షేక్ మహమ్మద్ అకీబ్ జావేద్ ప్రస్తుతం ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ పరీక్షల్లో మంచి ర్యాంకును సాధించి డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా ఎంపికయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు బంధువర్గంలో, స్నేహితుల్లో హర్షతిరేకాలు వెల్లువెత్తాయి.

జావేద్ కాలికట్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించి అటవీ శాఖ సెక్షన్ ఆఫీసరుగా ఎంపికయ్యారు. పల్నాడులోని సిరిగిరిపాడులో విధులను నిర్వహించారు. 2018లో ఎంపీడీఓగా ఉద్యోగాన్ని సాధించి బాపట్ల జిల్లాలోని యుద్ధనపూడి మండలం అభివృద్ధి అధికారిగా పని చేస్తున్నారు. గతేడాది గ్రూప్ వన్ పరీక్షలను రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జావేద్ ను తోటి ఉద్యోగులు, బంధుమిత్రులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Next Story