అంచనాకు అందని తుఫాను నష్టం.. తీవ్ర ఆవేదనలో జనసేన

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-12-06 13:32:09  IST  )

తుఫాను నష్టం అంచనాలకు అందడంలేదని జనసేన రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు...

అంచనాకు అందని తుఫాను నష్టం.. తీవ్ర ఆవేదనలో జనసేన
X

దిశ, వెబ్ డెస్క్: తుఫాను నష్టం అంచనాలకు అందడంలేదని జనసేన రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మించౌంగ్ తుఫానుతో రాష్ట్రంలో అపార నష్టం వాటిల్లడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి తెనాలి నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మనోహర్ పర్యటించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి రైతుల్ని ఆదుకోవాలని, తక్షణ సాయంగా ప్రతి రైతుకి రూ.20 వేలు సాయం అందించాలని సూచించారు. ప్రతి అడుగులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతోందని మండిపడ్డారు. నాలుగేళ్లుగా పంట కాలువలు మరమ్మతులు చేయకుండా మాయ చేశారని విమర్శించారు. ప్రతి గింజాకొనే వరకు జనసేన-టీడీపీ పోరాటం చేస్తుందని వెల్లడించారు.

Next Story