- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇటికంపాడులో ఘోరం.. పిడుగుపాటుతో మహిళా కూలీలు మృతి
by Thanuru Gopichand |
గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం ఇటికంపాడు వద్ద ఘోరం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం ఇటికంపాడు వద్ద ఘోరం జరిగింది. పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందడంతో బాధిత మహిళల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇటీవల గుంటూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇటికంపాడు వద్ద వరి పొలాల్లో మహిళా కూలీలు పని చేసుకుంటున్నారు. పని చేస్తున్న వారిపై పిడుగు పడడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలైన మరో మహిళను ఆసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన వారిని మరియమ్మ, షేక్ ముజాహిదగా గుర్తించారు.
Next Story






