యువకుడు చనిపోయినా ముగ్గురికి ప్రాణదానం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-26 14:58:25  IST  )

యువకుడు చనిపోయినా ముగ్గురికి ప్రాణదానం చేశాడు...

యువకుడు చనిపోయినా ముగ్గురికి ప్రాణదానం
X

దిశ, వెబ్ డెస్క్: యువకుడు చనిపోయినా ముగ్గురికి ప్రాణదానం చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా(Guntur District) తెనాలి మండలం పినపాడు(Pinapadu)లో జరిగింది. పినపాడుకు చెందిన యువకుడు అమర్ బాబు(Amarbabu) ఇంజినీరింగ్ చదువుతున్నారు. బైక్‌పై వెళ్తుండగా నిడుముక్కలలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో అమర్ బాబు బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో యువకుడి అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో వైద్యులు అమర్ బాబు లివర్, కిడ్నీలను గుంటూరు రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అమర్చారు. గుండెను మరో వ్యక్తి అవసరం నిమిత్తం విమానంలో తిరుపతికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గళ్లా మాధవి అమర్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. విషాదంలోనూ స్ఫూర్తిదాయకంగా నిలిచిన అమర్ బాబు కుటుంబాన్ని అభినందించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Next Story