టైరు పంక్చర్.. ఇద్దరు దుర్మరణం

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లా తాడికొండలో సంక్రాంతి వేళ విషాదం చోటు చేసుకుంది...

టైరు పంక్చర్.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడికొండ(Tadikonda)లో సంక్రాంతి వేళ(Sankranti) విషాదం చోటు చేసుకుంది. కారు(Car) టైరు పంక్చర్ అయి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. తుళ్లూరుకు చెందిన అఖిల్, తరుణ్ మరో ముగ్గురితో కలిసి కారులో బయల్దేరారు. తాడికొండ మండలం లాం గ్రామం శివారులో కారు టైర్ పంక్చర్ అయింది. దీంతో కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అఖిల్, తరుణ్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అఖిల్, తరుణ్ మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story