గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్ !

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ కు ( Gorantla Madhav ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ కు ( Gorantla Madhav ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వైసిపి పార్టీకి చెందిన గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వైసిపి మాజీ పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ కు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి 14 రోజులపాటు విధించారు. అంటే ఇవాల్టి నుంచి దాదాపు ఈ నెల 24వ తేదీ వరకు గోరంట్ల మాధవ్ జైల్లోనే ఉండబోతున్నారన్నమాట.

గోరంట్ల మాధవ్ తో పాటు మిగతా ఐదుగురు నిందితులకు కూడా ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. ఈ తరుణంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సహా.. ఇతర ఐదుగురు నిందితులను కూడా పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డి పైన టిడిపి పార్టీకి సంబంధించిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేయగా... చేబ్రోలు కిరణ్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ను కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం కోర్టు ముందు హాజరు పరచగా... మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story