Ap News: టీడీపీలోకి కన్నా.. ట్విస్ట్ ఇచ్చిన మాజీ ఎంపీ రాయపాటి

by Disha Web Desk 16 |
Ap News: టీడీపీలోకి కన్నా.. ట్విస్ట్ ఇచ్చిన మాజీ ఎంపీ రాయపాటి
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికపై నర్సరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పందించారు. తనకూ, కన్నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. అలాంటి వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. దివంగత నేతలు రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి హయాంలో కన్నాను బాగా సపోర్ట్ చేశారని పేర్కొన్నారు. పెదకూరపాడులో కన్నా లక్ష్మీనారాయణ, తాను పోటీ చేసినట్లు తెలిపారు. చంద్రబాబు ఆదేశిస్తే కన్నాతో కలిసి పోటీ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే నర్సరావుపేట ఎమ్మెల్యే బరిలో చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని రాయపాటి సాంబశివరావు తెలిపారు.

Next Story

Most Viewed