- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులపై గోరంట్ల మాధవ్ దురుసు ప్రవర్తన
ఏపీ పోలీసులపై (AP Police) మాజీ పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ( Former MP Gorantla Madhav) దురుసుగా

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పోలీసులపై (AP Police) మాజీ పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ( Former MP Gorantla Madhav) దురుసుగా ప్రవర్తించారు. నిన్న పోలీసులను అడ్డుకొని రెచ్చిపోయిన గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసిన పోలీసులు.... కోర్టుకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులపై కాస్త దురుసుగా ప్రవర్తించి రచ్చ చేశాడు గోరంట్ల మాధవ్ ( Gorantla Madhav). మీడియా ముందుకు రావాలని పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. అయితే దానికి గోరంట్ల మాధవ్ నిరాకరించారు.
అసలు మీడియా ముందుకు రానని... పోలీస్ జీపులోనే చాలా సీరియస్ గా కనిపించారు. పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తిని మీడియా ముందు పెడతారా అంటూ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన ఏపీ ప్రజలు... ఎంపీగా పని చేసిన వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఎపిసోడ్ అనంతరం గుంటూరు జిల్లా కోర్టుకు.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇది ఇలా ఉండగా... వైయస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jaganmohan Reddy ) సతీమణి వైయస్ భారతి రెడ్డిని ( YS Bharathi Reddy) ఉద్దేశించి సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ( TDP activist Chebrolu Kiran) అనుచిత కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. అయితే అరెస్టు చేసి కిరణ్ ను తరలిస్తున్న నేపథ్యంలో... పోలీసు వాహనాలను అడ్డుకొని రచ్చ చేశారు గోరంట్ల మాధవ్. దీంతో గోరంట్ల మాధవ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దురుసు ప్రవర్తన
— BIG TV Breaking News (@bigtvtelugu) April 11, 2025
మీడియా ముందుకు రావటానికి గోరంట్ల నిరాకరణ
ఎంపీగా పని చేసిన వ్యక్తిని మీడియా ముందు పెడతారా అంటూ మాధవ్ ఆగ్రహం
గుంటూరు జిల్లా కోర్టుకు గోరంట్ల మాధవ్ తరలింపు https://t.co/ZZYj6d5eiz pic.twitter.com/jolriVz14c






