హైకోర్టు ఆదేశాలు.. డీఎస్పీకి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని కీలక నిర్ణయం తీసుకున్నారు...

హైకోర్టు ఆదేశాలు.. డీఎస్పీకి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌(Palnadu District)లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు(SC/ST Atrocities Case) వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నేత పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం ఆమె తన పాస్‌పోర్ట్‌ను అధికారులకు అప్పగించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ విడదల రజిని నరసరావుపేటలోని డీఎస్పీ కార్యాలయానికి స్వయంగా వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ హనుమంతరావును కలిసి తన పాస్‌పోర్ట్‌ను అధికారికంగా అందజేశారు. ఈ కేసు తదుపరి దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని విడదల రజిని తరపు లాయర్లు పేర్కొన్నారు.

Next Story