రెడ్ బుక్‌కు నా కుక్క కూడా భయపడదు: అంబటి రాంబాబు

by Vemula.Srinu Prasad |

రెడ్ బుక్‌కు తన కుక్క కూడా భయపడదని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ..

రెడ్ బుక్‌కు నా కుక్క కూడా భయపడదు: అంబటి రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్: రెడ్ బుక్(Red Book)కు తన కుక్క కూడా భయపడదని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Ycp Leader Ambati Rambabu) అన్నారు. నకిలీ మద్యం కేసులో బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ రెడ్ బుక్‌లో తన పేరుందో లేదో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) చెప్పాలన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్నారనే వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. దేవాలయాలను అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల ప్రసాదంలో ఎలాంటి కల్తీ లేదని దర్యాప్తు సంస్థలు తేల్చాయని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story