Breaking: అంబటికి ఊరట.. బెయిల్ మంజూరు

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. ..

Breaking: అంబటికి ఊరట.. బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu)కు ఊరట లభించింది. సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై దూషించిన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలు(Rajahmundry Jail)లో ఉన్న ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలని స్పెషల్ మొబైల్ కోర్టు(Special Mobile Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

మరో కేసులో ఈ రోజే రిమాండ్

అయితే గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు ఈ రోజే రిమాండ్ విధించింది. ఈ కేసులో అంబటి జైలులోనే ఉండనున్నారు. మరోవైపు రాష్ట్రంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మరి ఈ కేసుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Next Story