Breaking: హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ .. 60 మంది బాలికలకు అస్వస్థత

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-01-30 11:57:41  IST  )

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం డా.బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది..

Breaking: హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ .. 60 మంది బాలికలకు అస్వస్థత
X

దిశ, డైనమిక్ బ్యూరో: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం డా.బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 60 మంది బాలికలకు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న బాలికలు వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో విద్యార్థినులను హుటాహుటిన సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యసేవలు అందుతున్నాయి. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సత్తెనపల్లి ఆర్డీఓ రాజకుమారి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

Next Story