సింగపూర్ ‘ఉత్తమ విధానాల’పై దృష్టి పెట్టండి: మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

by Ramesh Naini |

ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో పర్యటించనున్న 9 మంది మంత్రుల బృందానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక దిశానిర్దేశం చేశారు.

సింగపూర్ ‘ఉత్తమ విధానాల’పై దృష్టి పెట్టండి: మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో పర్యటించనున్న 9 మంది మంత్రుల బృందానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక దిశానిర్దేశం చేశారు. పర్యటనకు వెళ్లనున్న మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, జనార్దన్‌రెడ్డి తదితరులతో ఆయన గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

సింగపూర్‌లో అత్యుత్తమ విధానాలు

సింగపూర్‌లోని పరిపాలన, శాంతిభద్రతలు (లా అండ్ ఆర్డర్), రోడ్లు, పర్యాటక రంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అక్కడి అత్యుత్తమ విధానాలను (బెస్ట్ ప్రాక్టీసెస్) రాష్ట్రంలో ఎలా అమలు చేయవచ్చో పరిశీలించాలని, ఆ విధానాలను నేర్చుకుని రాష్ట్ర ప్రగతి కోసం వాటిని అమలు చేసేలా కృషి చేయాలని మంత్రులకు చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story