నరసరావుపేటలో జోరుగా క్రికెట్ బెట్టింగ్ దందా..! ఆరుగురు బుకీలు అరెస్ట్

by Ramesh Naini |

పల్నాడు జిల్లా నరసరావుపేటలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

నరసరావుపేటలో జోరుగా క్రికెట్ బెట్టింగ్ దందా..! ఆరుగురు బుకీలు అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పల్నాడు జిల్లా నరసరావుపేటలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణంలోని ఐలా బజారు కేంద్రంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున నగదుతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఐలా బజార్‌లో కొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. షేక్ ఖాసీం, షేక్ మస్తాన్ వలీ, షేక్ రఫీ జాన్, పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి, పతేలా వెంకటేశ్వరరావులను అరెస్ట్ చేశారు.

నగదు, ల్యాప్‌టాప్, మొబైల్స్ స్వాధీనం

నిందితుల వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. వారి నుంచి రూ. 4.58 లక్షల నగదు, ఒక ల్యాప్‌టాప్, ఆరు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ ముఠాను అత్యంత చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని స్థానిక డీఎస్పీ అభినందించి, వారికి ప్రత్యేక రివార్డులు అందజేశారు.

Next Story