Breaking: నాగార్జున సాగర్ కుడి కాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-01 12:47:13  IST  )

నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది...

Breaking: నాగార్జున సాగర్ కుడి కాలువలో దూకి ప్రేమజంట ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: నాగార్జున సాగర్(Nagarjuna Sagar) కుడి కాలువలోకి దూకి ప్రేమజంట(Lovers) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరింది. మాచర్ల(Macharla)కు చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్, దాసరి శ్రీలక్ష్మి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలిసింది. తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అయితే ఇరుకుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇద్దరూ నాగార్జునసాగర్ కుడి కాలువలో దూకి బలవన్మరణానికి యత్నించారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో మాచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story