మంగళగిరిలో నారా లోకేశ్‌ను ఓడించేందుకు వైసీపీ బిగ్ స్కెచ్.. కీలక నేతకు బాధ్యతలు..!

by Vemula.Srinu Prasad |

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఓడించేందుకు వైసీపీ అధిష్టానం బిగ్ స్కెచ్ వేస్తోంది...

Nara Lokesh
X

దిశ, గుంటూరు ప్రతినిధి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఓడించేందుకు వైసీపీ అధిష్టానం బిగ్ స్కెచ్ వేస్తోంది. ఆయన పోటీ చేయబోయే మంగళగిరి నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండాను ఎగురవేయాలని భారీ ప్లాన్ చేస్తున్నారు. రానున్న ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన అధిష్టానం మంగళగిరిఇంఛార్జి గా ప్రస్తుతం గంజి చిరంజీవిని ప్రకటించింది. అయితే గత ఎన్నికల్లో లోకేశ్‌పై గెలిచిన ఆళ్ళ రామకృష్ణ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో లోకేశ్‌కు, ఆర్కేకు చెక్ పెట్టాలనే సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.


ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల ఇంఛార్జి‌గా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. త్వరలో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. వైసీపీలో నెంబర్ 2 గా విజయసాయిరెడ్డి... మండలాలు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారం చేయనున్నారని సమాచారం. వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవి గెలుపునకు విజయసాయిరెడ్డి వ్యూహాలు బాగా పని చేస్తాయని సీఎం జగన్ నమ్ముతున్నారట. ఈ మేరకు మంగళగిరి నియోజవకర్గంలో లోకేశ్, ఆళ్లను ఓడించేందుకు గంజి చిరంజీవితో పాటు విజయసాయిరెడ్డి రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. మరి మంగళగిరిలో ఈసారి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Next Story