- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ రహదారులపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.... బెంచ్ మార్క్‌గా ఉండాలని ఆదేశం
by Vemula.Srinu Prasad |
నేషనల్ హైవే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర బెంచ్ మార్క్ తప్పనిసరిగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: నేషనల్ హైవే ప్రాజెక్టుల(National Highway Projects)ను చేపట్టే విషయంలో రాష్ట్ర బెంచ్ మార్క్ తప్పనిసరిగా ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులపై ఆయన సమీక్షించారు. నేషనల్ హైవేల నెట్ వర్క్ విస్తరణ, రాష్ట్ర రోడ్లు, రోడ్ల డెన్సిటీ పెంపు వంటి అంశాలపై చర్చించిన చంద్రబాబు.. రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులు ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్నాయని, వాటిని 4 లేన్లుగా మార్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో చేపట్టిన జాతీయ ప్రాజెక్టుల పురోగతి, నూతన రహదారుల నిర్మాణంపై ఎప్పటికప్పుడు తమకు రిపోర్టులు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Next Story






